కార్పొరేషన్ కు ఏజెన్సీ చిక్కులపై ఆరా .. 7 గ్రామాల్లో పర్యటించిన మున్సిపాలిటీ ​రీజినల్ ​డైరెక్టర్ ​మసూద్​

కార్పొరేషన్ కు ఏజెన్సీ చిక్కులపై ఆరా .. 7 గ్రామాల్లో పర్యటించిన మున్సిపాలిటీ ​రీజినల్ ​డైరెక్టర్ ​మసూద్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతోపాటు సుజాతనగర్​మండలంలోని 7 గ్రామాలు సుజాతనగర్​, నర్సింహసాగర్​, కొమిటిపల్లి, నిమ్మలగూడెం, లక్ష్మీదేవిపల్లి, మంగపేట, నాయకులగూడెంలను కలుపుతూ ప్రభుత్వం కొత్తగూడెం కార్పొరేషన్​ ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏజెన్సీ చిక్కులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రత్యేక పరిశీలకుడిగా నియమితులైన మున్సిపాలిటీ​రీజినల్​డైరెక్టర్​మసూద్​గురువారం ఆయా గ్రామాల్లో పర్యటించి, ప్రజలతో మాట్లాడారు. 

7 పంచాయతీల్లో ఎటువంటి ఏజెన్సీ ఇబ్బందులు లేవని, ఇవి ప్లేన్​ఏరియాలని ఆఫీసర్లు తెలిపారు. అనంతరం ఆయన కొత్తగూడెం మున్సిపల్​కార్యాలయంలో కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల కమిషనర్ సుజాతతోపాటు టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులు, సర్వేయర్లతో రివ్యూ నిర్వహించారు. పలు విభాగాలను పరిశీలించారు. ఫైల్స్​మూటకట్టి ఉండటం చూసి, ఇంత అప్​డేట్​టైమ్​లో కూడా మూటలు కడితే ఎలా అన్నారు. అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.