- ఉత్తర్వులు జారీ చేసిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సంప్రదింపుల కమిటీలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సంప్రదింపుల కమిటీకి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి చైర్మన్ గా వ్యవహరించనుండగా.. సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ సహాయకులుగా ఉండనున్నారు. ఈ కమిటీలో లోక్ సభ నుంచి 9 మంది, రాజ్య సభ నుంచి ఇద్దరు, ఎక్స్ ఆఫీషియో మెంబర్లుగా ఇద్దరు.. చైర్మన్, సహాయ మంత్రితో కలిపి మొత్తం 15 మంది ఉండనున్నారు.