నిజామాబాద్ నగరపాలక సంస్థలో గత ప్రభుత్వ హయాంలో రూ. కోట్లు విలువ చేసే ఆధునిక వాహనాలు కొనుగోలు చేశారు. అందులో రోడ్డు క్లీనర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ క్లీనర్, ట్రాక్టర్లు, చెత్త సేకరణ వాహనాలు, ఎలక్ట్రానిక్ వాహనాలు, ఆటోలు ఉన్నాయి. గత ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల వాటి నిర్వహణ లేక, మూలన పడ్డాయి. చిన్న చిన్న మరమ్మతులు చేస్తే వాహనాలు పనిచేస్తాయి.
రూ. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన వాహనాలు ఇలా పిచ్చి మొక్కల మధ్య పడేయడంతో పారిశుద్ధ్యం నిర్వహణ పై ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేయిస్తే వాటిని ఉపయోగించుకోవచ్చని జనం సూచిస్తున్నారు.
- వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్