ఫాజుల్ నగర్ రిజర్వాయర్ దగ్గర వేములవాడ ఎమ్మెల్యే.. ప్రభుత్వ విప్.. ఆది శ్రీనివాస్ ఎల్లంపల్లి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఎండాకాలం రాకముందే శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మోటార్ ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. బోరు బావులు.. బావులు .. భూగర్భజలాలు ఎండిపోకుండా.. రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ముందుగానే నీటిని విడుదల చేసిందని ఆది శ్రీనివాస్ తెలిపారు. చెరువులు.. కుంటలు నిండి రైతులు పంటపొలాలు పచ్చగా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు రోడ్డు ఎక్కితే.. నీరు విడుదల చేసే పరిస్థితి ఉండేదని.. కాని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుసమస్యలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే నీరు విడుదల చేశామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
గత ప్రభుత్వంలో మరిపల్లి రిజర్వాయర్, ఊర చెరువు, లచ్చంపేట తండా రిజర్వాయర్, కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని రైతులు ఆందోళన చేసినా పట్టించుకోలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రిజర్వాయర్,కలికోట సూరమ్మ చెరువు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు.
రైతుల ప్రయోజనాలు కోసం పడవు పడ్డా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. ఇంకా లొంక చెరువు, ఆశిరెడ్డి పల్లె కొత్త చెరపు, సనుగుల ఎర్ర చెరువు పటేల్ చెరువులకు నీటిని అనుసంధానం చేసి.. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకుని.. సాగు, తాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి ప్రాజెక్ట్‌ల పనులను పూర్తి చేస్తామరి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.