హైదరాబాద్, వెలుగు: గత పదేండ్లలో రెండు వేల మంది తెలంగాణకు చెందిన కార్మికులు గల్ఫ్ లో చనిపోతే కేసీఆర్ ఆ కుటుంబాలకు అణా పైసా ఇవ్వలేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను సీఎం రేవంత్ నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన చేశారు.
గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, వారి పిల్లలకు గురుకులాల్లో చదివే చాన్స్, వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా సలహా మండలి, ప్రజా భవన్ లో వారి సమస్యలను పరిష్కరించడం కోసం ప్రత్యేకంగా ఒక అధికారిని నియమిస్తున్నామని చెప్పారు.