- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: వేములవాడ టెంపుల్, పట్టణంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభానికి సీఎం రేవంత్‌రెడ్డి త్వరలోనే వేములవాడలో పర్యటించనున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తెలిపారు. శనివారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి బద్ధిపోచమ్మ ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి మున్సిపల్ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవితో కలిసి భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పట్టణాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. పట్టణంలో మెయిన్‌రోడ్డుపై ఆగిపోయిన బ్రిడ్జిల నిర్మాణానికి భూసేకరణ కోసం ఇటీవల రూ.6.96 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ బింగి మహేశ్, లీడర్లు పుల్కం రాజు, రామతీర్థపు రాజు, చిలుక రమేశ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు