కేటీఆర్ తొమ్మిదో ప్యాకేజీ పట్టించుకోలేదు : ఆది శ్రీనివాస్

కేటీఆర్ తొమ్మిదో ప్యాకేజీ పట్టించుకోలేదు : ఆది శ్రీనివాస్

ఎల్లారెడ్డిపేట, వెలుగు: సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే కేటీఆర్  9వ ప్యాకేజీ  గురించి పట్టించుకోలేదని 10,11 ప్యాకేజీ ద్వారా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేశాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.  ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామం వద్ద ఉన్న 9వ ప్యాకేజీ  కెనాల్ ను ఆదివారం నియోజకవర్గ ఇన్చార్జి  కేకే మహేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  ఇక్కడి రైతుల పంటలు ఎండిపోతుంటే వారి గోస చూడలేక మల్కపేట రిజర్వాయర్ నుంచి మొదటి సారి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశామన్నారు.  రైతులకు నీటిని విడుదల చేస్తే సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని అన్నారు.  కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం,   వైస్ చైర్మన్  రామ్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి,  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య,  బాల్ రెడ్డి చెన్నిబాబు పాల్గొన్నారు