- పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు : దుబాయ్, అబుదాబిలో ఈటీసీఏ, గల్ఫ్ తెలంగాణ సంఘం, స్పార్క్ మీడియా, టాడ్ ఆధ్వర్యంలో దసరా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకులకు చీఫ్ గెస్ట్‌గా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల కోసం ప్రభుత్వ కృషి, బోర్డు ఏర్పాటుపై అక్కడి ప్రతినిధులతో చర్చించారు. ఆయన మాట్లాడుతూ గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.
దేశ విదేశాల్లో తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉన్నా బాగుండాలన్నారు. ఎన్నికల్లో గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీ నెరవేర్చామని, సీఎం రేవంత్ రెడ్డి కి గల్ఫ్ కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అరబ్ దేశాల్లో సైతం బతుకమ్మ వేడుకలు జరపడం భావితరాలకు మన సంస్కృతీ సంప్రదాయాలు అందిచాలన్నారు.