రోడ్డు భద్రత నియమాలు పాటించాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్​

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్​

వేములవాడ, వెలుగు : వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌ ఆది శ్రీనివాస్ సూచించారు. రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా గురువారం వేములవాడలో నిర్వహించిన సడక్ సురక్ష అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిప్పాపూర్ బస్టాండ్ నుంచి రాజన్న ఆలయం వరకు స్వయంగా ఆటో నడిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని, ఇల్లు లేని ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు  చేస్తామన్నారు. 

కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, డీటీవో లక్ష్మణ్, ఎంవీఐ వంశీధర్, సీఐ వీరప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేశ్‌‌‌‌‌‌‌‌, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేశ్‌‌‌‌‌‌‌‌, ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు, తదితరులు పాల్గొన్నారు. 

పేర్లు లేని వారు ఎలాంటి ఆందోళన చెందవద్దు 

ప్రజాపాలన గ్రామసభల్లో చదివిన జాబితాల్లో వివిధ పథకాల కింద పేర్లు రాని అర్హులు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​ సూచించారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరంలో గురువారం ప్రజా పాలన గ్రామసభకు ఆయన హాజరయ్యారు.  అనంతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా సుభాష్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు.