కుల గణనలో తెలంగాణ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోడల్ : ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ​

కుల గణనలో తెలంగాణ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోడల్ : ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ​

వేములవాడ, వెలుగు: బీసీ కులగణన పూర్తిచేసి తెలంగాణ దేశానికి రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచిందని ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పెంపు బిల్లులను అసెంబ్లీ ఆమోదించిందని, వీటిని లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభలో ఆమోదించి షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 9లో చేర్చాలని డిమాండ్ చేశారు.  

అంతకుముందు పట్టణంలోని ప్రభుత్వ గర్ల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైస్కూల్, కేరళ మోడల్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన యాన్యువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేకు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో వంద శాతం హాజరు ఉన్న విద్యార్థులను ఆయన  సన్మానించారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్​ గౌడ్, మాజీ వైస్​ చైర్మన్​ బింగి మహేశ్​, పాల్గొన్నారు.

కరీంనగర్ సిటీ, వెలుగు:  రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. శుక్రవారం గాంధీ రోడ్డులోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర ప్రారంభించారు. 3, 22, 24, 25 డివిజన్లలో పాదయాత్ర చేపట్టారు. ఆయన వెంట లీడర్లు పురుమళ్ల శ్రీనివాస్, గంట కల్యాణి, దండి రవీందర్, జీడీ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చంద్రశేఖర్ పాల్గొన్నారు.