వేములవాడ, వెలుగు : రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు వ్యాపారులు కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని త్రినేత ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాటన్ ట్రేడర్స్ అసోసియేషన్ , ఫరిలైజర్స్, ఫెస్టిసిడ్స్ సిడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడారు. వ్యాపారుల అభివృద్ధికి ప్రభుత్వ పక్షాన కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఫర్టిలైజర్ సీడ్స్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీ కాంతారావు చందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ పాల్ పాల్గొన్నారు.
చందుర్తి : మండలంలోని సనుగుల,దేవునితండా గ్రామాల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఎన్నికై మొదటిసారి సనుగుల గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. తన విజయానికి కృషి చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేశారు.