రాజన్న ఆలయ అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభిస్తాం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్​

రాజన్న ఆలయ అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభిస్తాం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్​

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు టెండర్ పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్​ వెల్లడించారు. సోమవారం రూ.80 లక్షలతో నిర్మించనున్న మార్కెట్‌‌‌‌ జోన్​పనులకు, రూ.56.50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు నిర్మాణానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ మూడో బ్రిడ్జి నిర్మాణం  చేపడుతున్నామన్నారు. రూ.76 కోట్లతో ఆలయ విస్తీర్ణణకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని,  త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. అంతకుముందు రంజాన్‌‌‌‌ వేడుకలకు హాజరయ్యారు. కార్యక్రమంలో లైబ్రరీ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ రాకేశ్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ పాల్గొన్నారు. 

ఐఎంఏ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ప్రారంభం

ఐఎంఏ సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని బైపాస్‌‌‌‌లో క్రికెట్ పోటీలను విప్​ ఆది శ్రీనివాస్​ ప్రారంభించారు.  ఈ పోటీల్లో డాక్టర్లు, పోలీసులు, జర్నలిస్టులు, లాయర్లు, టీచర్లు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొనట్లు  ఐఎంఏ అధ్యక్షుడు నాగమల్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ పోటీలు ఏప్రిల్ 6 వరకు కొనసాగనున్నాయి. 

ఎల్లరెడ్డిపేట, వెలుగు: ఆధ్యాత్మికతతోనే ప్రశాంత జీవితం సాధ్యమని ఓమౌజయా మహాగురు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో ఉగాది సందర్భంగా 5 రోజులుగా మహాక్రతువు నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై గురువు ఆశీస్సులు తీసుకున్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ రాంరెడ్డి, ప్యాక్స్‌‌‌‌ చైర్మన్ కృష్ణారెడ్డి, లక్ష్మణ్ రావు, గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.