బీఆర్ఎస్​ లీడర్ల అహంకారం తగ్గలేదు : ఆది శ్రీనివాస్​

బీఆర్ఎస్​ లీడర్ల అహంకారం తగ్గలేదు :  ఆది శ్రీనివాస్​
  • ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​

వేములవాడ, వెలుగు: అధికారం కోల్పోయినా అహంకారం తగ్గలేదని ప్రభుత్వ విప్​ఆది శ్రీనివాస్​ బీఆర్‌‌‌‌ఎస్‌‌ లీడర్లపై ఫైర్​అయ్యారు. అసెంబ్లీ స్పీకర్‌‌‌‌పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వేములవాడ పట్టణంలో మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్‌‌‌‌, జగదీశ్‌‌రెడ్డికి గవర్నర్ అంటే గౌరవం లేదని,  స్పీకర్ అంటే లెక్కలేదన్నారు. 

జగదీశ్‌‌రెడ్డి మాటలు తప్పు కాదన్నట్లు కేటీఆర్ సమర్థించడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైనా తప్పును ఒప్పుకొని స్పీకర్‌‌‌‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్​రొండి రాజు, వైస్​ చైర్మన్​రాకేశ్‌‌, పట్టణ​అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్‌‌గౌడ్‌‌ పాల్గొన్నారు.  

కోరుట్ల, వెలుగు: ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే  ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం కథలాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆఫీస్​ ఆవరణలో  రూ.10.77 లక్షల విలువైన 28 మంది సీఎంఆర్‌‌‌‌ఎఫ్‌‌ చెక్కులను అందజేశారు. 

పట్టు వస్త్రాల సమర్పణ

వేములవాడ రాజన్న ఆలయంలో ఆదివారం నిర్వహించిన శివ కల్యాణంలో స్వామివారికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.. రాజన్న ఆలయంలో నిర్వహించిన బేరి పూజ, దేవతాహ్వానం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈవో వినోద్​ రెడ్డి వారికి స్వాగతం పలికారు.