జగిత్యాల టౌన్/ రాయికల్, వెలుగు : రోళ్లవాగు ప్రాజెక్టు పెండింగ్పనులను పూర్తిచేస్తామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. శనివారం సారంగాపూర్, రాయికల్ మండలాల్లోని పలు గ్రామాల్లో కొత్త జీపీ భవనాలకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్‌పర్సన్ వసంతతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా
వారు మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే ఏ విషయంలో పార్టీలకతీతంగా పనిచేస్తామన్నారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సంధ్యారాణి, జడ్పీటీసీ జాదవ్ ఆశ్విని, సర్పంచులు సుమలత, రవి, ఎంపీటీసీలు విజయలక్ష్మి, స్వప్న, అధికారులు పాల్గొన్నారు.