ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

కురవి/ నల్లెబెల్లి, వెలుగు: రైతులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్ అన్నారు. శుక్రవారం కురవి, సీరోలు, డోర్నకల్ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్​పార్టీ కురవి మండలాధ్యక్షుడు అంబటి వీరభద్రం, వీరభద్రస్వామి ఆలయ చైర్మన్ కొర్ని రవీందర్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 వరంగల్​జిల్లా నల్లబెల్లి మండలం మామిండ్ల, వీరయ్యపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్​పాలాయి శ్రీనివాస్​తహసీల్దార్​కృష్ణతోపాటు పలువురు లీడర్లతో కలిసిప్రారంభించారు.