గిరిజనులకు పెద్దపీట వేసింది కాంగ్రెసే : రాంచందర్​ నాయక్

గిరిజనులకు పెద్దపీట వేసింది కాంగ్రెసే : రాంచందర్​ నాయక్
  • ప్రభుత్వ విప్​ జాటోతు రాంచందర్​ నాయక్

పాలకుర్తి, వెలుగు: గిరిజనులకు పెద్దపీట వేసింది కాంగ్రెస్​పార్టీయేనని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్ అన్నారు. సోమవారం పాలకుర్తి చిట్యాల ఐలమ్మ వ్యవసాయ మార్కెట్​పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం పాలకుర్తి ఎమ్మెల్యే, పీఏసీ మెంబర్​మామిడాల యశస్వినిరెడ్డి అధ్యక్షత జరిగింది. మార్కెట్​ చైర్​పర్సన్​గా లావుడియా మంజుల, వైస్​ చైర్మన్ గా అనుముల మల్లారెడ్డి, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాంచందర్​నాయక్​మాట్లాడుతూ కేసీఆర్​ హయాంలో గిరిజనులకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో వారికి పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. 

ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ తాను పాలకుర్తిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు పదవులు లభిస్తాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్​దే విజయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన కార్పొరేషన్​చైర్మన్​తేజావత్​ బెల్లయ్య నాయక్, రాష్ట్ర మహిళా కమిషన్​మెంబర్​చిట్యాల శ్వేత, మాజీ ఎంపీ ధరావత్​ రవీంద్రనాయక్, కాంగ్రెస్​ నాయకురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, పీసీసీ మెంబర్​డాక్టర్​ లక్ష్మీనారాయణ, తొర్రూర్​మార్కెట్​కమిటీ చైర్మన్​హనుమాండ్ల తిరుపతిరెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పాలకుర్తిలో చైర్​పర్సన్​మంజుల ఆధ్వర్యంలో గిరిజనులు మార్కెట్​యార్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వారితో కలిసి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి నృత్యం చేసి ఆకట్టుకున్నారు.