పినపాక, వెలుగు: పినపాక మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీసు వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఫైర్స్టేషన్ను ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతమైన పినపాక, కరకగూడెం మండలాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఫైరింజన్లు రావడానికి చాలా సమయం పడుతోందన్నారు.
చాలాసార్లు ఆస్తి నష్టం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీ మేరకు పినపాకలో ఫైర్ స్టేషన్ఏర్పాటు చేశామన్నారు. పినపాక, కరకగూడెం ఎంపీపీలు గుమ్మడి గాంధీ, రేగా కాళిక, ఫైర్ఆఫీసర్లు, మండల ఆఫీసర్లు, బీఆర్ఎస్నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు ఎంపీడీఓ ఆఫీసు వద్ద నిరసన దీక్షలు చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు ఎమ్మెల్యే కాన్వాయ్ ను అడ్డుకోగా, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.