ప్రభుత్వానికి, ప్రజలకు జర్నలిస్టులు వారధి

ప్రభుత్వానికి, ప్రజలకు జర్నలిస్టులు వారధి

వేములవాడ, వెలుగు: దేశంలో మీడియా ఫోర్త్​ఎస్టేట్‌‌గా ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని మహదేవ్ ఫంక్షన్ హాల్‌‌లో నిర్వహించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(టీయూడబ్ల్యూజే) 143 యూనియన్‌‌ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల మహాసభ నిర్వహించారు. ఈ సభకు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ హాజరయ్యారు.

యూనియన్​ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన లాయక్​ పాషను అభినందించారు. జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటారన్నారు. సమావేశంలో యూనియన్‌‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్, ప్రెస్​క్లబ్​ అధ్యక్షుడు మహ్మమద్​ రఫీ, కొలిపాక నర్సయ్య, అలీ కొత్వాల్,​ శ్రీనివాస్​, జితేందర్పాల్గొన్నారు.