కాంగ్రెస్​ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట

వేములవాడరూరల్, వెలుగు : కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  ఆది శ్రీనివాస్​ అన్నారు. శనివారం వేములవాడ రూరల్​ మండలం మల్లారం, మర్రిపల్లి గ్రామాల్లో కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించి, పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్​ సర్కార్​ రూ. 6 లక్షల కోట్లు అప్పులు చేసి కనీసం మున్సిపాలిటీలకు కరెంట్​ బిల్లులు కూడా కట్టలేదని విమర్శించారు. ప్రజా సమస్యలను విడతల వారీగా పరిష్కరిస్తామన్నారు.

అనంతరం చెక్కపల్లి గ్రామంలో సొసైటీ గోదాంను జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ అరుణ, నాఫ్కాబ్ ​చైర్మన్​రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్​ అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్​, ప్యాక్స్ ​చైర్మన్ ​తిరుపతిరెడ్డి, ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ వాణి, సర్పంచ్ ​కరుణాకర్​, మాజీ ఎంపీపీ వెంకటేశ్, బీసీ సెల్​అధ్యక్షుడు సాయికృష్ణ, లీడర్లు పాల్గొన్నారు.

చందుర్తి, వెలుగు : చందుర్తి మండలకేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో 96 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​ పంపిణీ చేశారు. జడ్పీటీసీ కుమార్, ఎంపీపీ లావణ్య, తహసీల్దార్​శ్రీనివాస్, ఎంపీడీవో రవీందర్ పాల్గొన్నారు.