- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్నను రాజకీయాల్లోకి తీసుకురావాలని చూస్తే పుట్టగతులుండవని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం వేములవాడ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో మార్కెట్‌కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా పిచ్చి రాతలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
వాట్సప్ యూనివర్సిటీల ద్వారా పిచ్చి రాతలతో రోత పుట్టించేలా ప్రభుత్వంపై నిందలు మోపాలని చూస్తున్నారన్నారు. ప్రతిపక్షాల కుట్రలను రాజన్న భక్తులు, ప్రజలు గమనించాలని కోరారు. రాజన్న భక్తులకు మెరుగైన సేవల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. రాజన్న సొమ్ము ఒక్క రూపాయి కూడా వృథా కానివ్వమన్నారు.
ఏఎంసీ చైర్మన్‌గా రొండి రాజు
వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రొండి రాజు, వైస్ చైర్మన్‌గా కనికరపు రాకేశ్ ప్రమాణస్వీకారం చేశారు. డైరెక్టర్లుగా మ్యాక స్రవంతి, గుర్రం విద్యాసాగర్, చీకోటి నాగరాజు, దైత కుమార్, ఎస్.కె సాబీర్, చెరుకు శంకర్, ఖమ్మం గణేశ్, మానుపాటి పర్శరాములు, కత్తి కనకయ్య, రాగిరి నాగరాజు, పాలకుర్తి పర్శరామ్ గౌడ్, వస్తాద్ కృష్ణ గౌడ్, ఎక్స్అఫీషియో మెంబర్‌గా సల్మాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.