విప్ రేగాకు నిరసన సెగ

బూర్గంపహాడ్, వెలుగు : మండలంలోని అంజనాపురం గ్రామంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ఆదివారం నిరసన సెగ తగిలింది. గ్రామంలో నిర్మించిన సీసీ రహదారులను ప్రారంభించేందుకు వచ్చిన రేగా కాంతారావును గ్రామంలోని మహిళలు, యువకులు అడ్డుకున్నారు.

ఈ ఐదు సంవత్సరాల కాలంలో తమ గ్రామాన్ని పట్టించుకోలేదని ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో మా గ్రామం గుర్తొచ్చిందా అని గ్రామస్తులు ఎమ్మెల్యే రేగాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కలగజేసుకొని గ్రామస్తులను సముదాయించారు. అనంతరం రేగా కాంతారావు అక్కడినుంచి వెనుతిరిగారు.