- మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ధ్వజం
యాదగిరిగుట్ట, వెలుగు : మంత్రి పదవి కోసం అడ్డమైన పనులు అన్నీ చేసినవ్ అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ధ్వజమెత్తారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఆదివారం ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పై జగదీశ్ రెడ్డి కామెంట్లను ఖండించారు. ఎర్రవల్లిలోని ఫాం హౌస్ లో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మందులో సోడా పోసి, పెగ్గు మీద పెగ్గు కలిపి మంత్రి పదవి తెచ్చుకున్నవ్. మంత్రి పదవి కోసం అడ్డమైన పనులన్నీ చేసినవ్. అలాంటి నువ్వు తన రాజకీయ
వ్యక్తిగత జీవితం మొత్తం ప్రజల కోసమే త్యాగం చేసి, అదే ప్రజల అండతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హతే లేదు’ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం కావడాన్ని జీర్ణించుకోలేకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని తెలిపారు. ఇకనైనా బుద్ధి మార్చుకుని ప్రజలు అప్పగించిన ప్రతిపక్ష పాత్రనైనా సరిగా పోషించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, యాదగిరిగుట్ట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి మధుసూదన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్ గౌడ్, టౌన్ పార్టీ అధ్యక్షుడు బందారపు భిక్షపతి, జిల్లా నాయకుడు ఎరుకల హేమేందర్ గౌడ్ ఉన్నారు.