సమగ్ర సర్వేతో  బీసీలకు ఎంతో మేలు : ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్

సమగ్ర సర్వేతో  బీసీలకు ఎంతో మేలు : ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్

మహబూబాబాద్, వెలుగు : సమగ్ర సర్వేతో బీసీలకు ఎంతో మేలు కలుగుతుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్​ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ క్యాంప్ ఆఫీస్​లో, మరిపెడ పట్టణ కేంద్రంలోని భార్గవి ఫంక్షన్​హాల్లో జరిగిన వేర్వేరు సమావేశాల్లో ఆయన మాట్లాడారు. దేశంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తొలిసారిగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల వర్తింపు కోసం హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టనున్నారని తెలిపారు.

ఎమ్మెల్యే మురళీ నాయక్ మాట్లాడుతూ ఆఫీసర్లు గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్న క్రమంలో ప్రజలు అన్ని వివరాలు అర్థమయ్యేలా తెలుపాలని కోరారు.  కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ జె.భరత్ చందర్ రెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి, నాయకులు ఘనపురం అంజయ్య, భట్టునాయక్,  వివిధ మండలాల కాంగ్రెస్​ నాయకులు తదితరులు పాల్గొన్నారు.