డోర్నకల్​లో బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తాం : రామచంద్రు నాయక్

  •     ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్

మరిపెడ, వెలుగు : డోర్నకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తామని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది టచ్ లో ఉన్నారని, చేర్చుకునే టైం వచ్చిందన్నారు.

ఎవరైనా పార్టీలోకి వస్తానంటే వద్దనొద్దని, అవసరమైతే ఇంటికెళ్లి ఆహ్వానిస్తామన్నారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మండలాల వారీగా కమిటీలు వేసి కొత్తవారిని పాతవారిని కలుపుకొని సమన్వయంతో 70 వేల మెజార్టీ లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ పెండ్లి రఘువీర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, రవి నాయక్, ఐలమల్లు, తాజుద్దీన్ పాల్గొన్నారు.