సీఎం కేసీఆర్​ హయాంలోనే అభివృద్ధి : గంప గోవర్ధన్

భిక్కనూరు,వెలుగు: కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్​హయాంలో రాష్ట్రం అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేర్కొన్నారు. బుధవారం ఆయన భిక్కనూరులో రూ.10.15 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. గోవర్ధన్​మాట్లాడుతూ.. 40 ఏండ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్​హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. 

రైతు బంధు, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ లాంటి పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. మరోసారి కేసీఆర్​నాయకత్వాన్ని బలపరచాలన్నారు. కార్యక్రమంలో టౌన్ సర్పంచ్​నల్లపు అంజలి, శ్రీనివాస్, ఎంపీపీ శారద, జడ్పీటీసీ తిర్మల్​గౌడ్, బీఆర్ఎస్​మండలాధ్యక్షుడు మధుసూధన్​రావు తదితరులు పాల్గొన్నారు.