
కోనరావుపేట, వెలుగు: బీఆర్ఎస్ లీడర్లు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, అధికారంలో ఉన్న రోజులు ఏనాడూ రైతులను పట్టించుకోని కేటీఆర్.. ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నాడని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. బుధవారం కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో మల్కపేట రిజర్వాయర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ రైతులను మభ్య పెట్టాలని ఏవేవో అభూతకల్పనలు చెప్పడం మానుకోవాలన్నారు. కేటీఆర్ మీ 10 పదేండ్ల పాలనలో మల్కపేట రిజర్వాయర్ నుంచి సిరిసిల్ల పరిధిలోని ఒక్క గ్రామానికి చుక్కనీరు తీసుకెళ్లావా అని ప్రశ్నించారు.
రైతుల కోరిక మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర మంత్రులతో మాట్లాడి గిరిజన తండా గుట్టల వరకు కాలువల ద్వారా నీరు ఇచ్చామన్నారు. వేములవాడ నియోజకవర్గంలో లేని కాల్వ కింద పొలాలు ఎండుతున్నాయని సోషల్ మీడియాలో పెట్టి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయలు ఎల్లయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రభాకర్, డైరెక్టర్లు, లీడర్లు బొర్ర రవీందర్, కార్తీక్ గౌడ్, భాస్కర్, శ్రీనివాస్ గౌడ్, అంజయ్య, నాయకులు, ప్రాజెక్ట్ అధికారులు పాల్గొన్నారు.
రేణుక ఎల్లమ్మ కల్యాణంలో ప్రత్యేక పూజలు
వేములవాడ, వెలుగు: వేములవాడ అర్బన్ మండలం కోడుముంజ గ్రామంలో రేణుక ఎల్లమ్మ, జమదగ్నిలా కల్యాణంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం గౌడ్, ఎర్రం సత్తయ్య, గౌడ సంఘ సభ్యులు
పాల్గొన్నారు.