రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించాలని కేటీఆర్, హరీష్ రావు చూస్తున్నారని ప్రభుత్వ్ విప్ , వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేముల వాడ అర్బన్ మండలం అనుపురం, తెట్టకుంట, చీర్లవంచ గ్రామాల్లో గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి, పలు అభవృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మె్ల్యే ఆది శ్రీనివాస్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ , 500 లకే గ్యాస్ సిలిండర్ అందించడం కాంగ్రెస్ గొప్పతనం అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకుపెంచారన్నారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న పథకాలను చూసి ఓర్వలేక కేటీఆర్ , హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది., కరువు వచ్చిందని కేటీఆర్, హరీష్ రావు అంటున్నారు.. వారికి బుద్ధుండే మాట్లాడుతున్నారని అని విమర్శించారు. మేడిగడ్డలో7 టీఎంసీల నీటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందే వదిలిపెట్టారని.. ఎన్నికల కంటే ముందే మేడిగడ్డ కృంగిపోయిందని రిపోర్టు రాగానే బీఆర్ ఎస్ ప్రభుత్వం ఆగమేగాల మీద లోపాలను కప్పిపుచ్చుకునేందుకు నీటిని సముద్రంలోకి వదిలిందన్నారు.మేడిగడ్డ ప్రాజెక్టుతో లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.
అన్నారం బ్యారేజీలో ఉన్న నీటిని వాడుకుందామంటే బ్యారేజ్ పిల్లర్లలో నుంచి నీరు లీక్ అవడం వల్ల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పడంత నీటిని దిగువకు విడుదల చేశామన్నారు. దీనంతటికీ బీఆర్ ఎస్ నేతల కారణం మండిపడ్డారు. అయినా సరే రైతాగానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా నీరు అందించే ఏర్పాటు చేస్తామన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లు రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించాలని చూస్తున్నారని.. ప్రజలు బీఆర్ఎస్ నేలత మాటలు నమ్మొద్దని అన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ .