కోనరావుపేట, వెలుగు : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటికీ అమలుచేస్తోందన్నారు. ఈ నెల 26 నుంచి నాలుగు పథకాలను అమలు చేయనున్నట్లు చెప్పారు.
మెట్‌పల్లి, వెలుగు : అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా అందేలా కృషి చేస్తామని కోరుట్ల నియోజవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. బుధవారం మెట్‌పల్లి పట్టణంలో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలో ఆయన పాల్గొన్నారు.
కరీంనగర్ టౌన్ : అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే బల్దియా లక్ష్యమని, ఆ దిశగా ముందుకెళ్తున్నామని మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. బుధవారం 33వ డివిజన్ వార్డు సభలో మేయర్ దరఖాస్తులు స్వీకరించారు.
మల్యాల : అర్హుల లిస్టులో పేరు రానివారు మళ్లీ అప్లై చేసుకోవచ్చని అడిషనల్ కలెక్టర్ గౌతమ్‌రెడ్డి సూచించారు. మల్యాల మండలం సర్వాపూర్, బల్వంతాపూర్, నూకపల్లి, మద్దుట్ల, రామన్నపేట గ్రామాల్లో బుధవారం గ్రామసభలు నిర్వహించారు. ప్రజలు అపోహాలు పెట్టుకోవద్దని, అర్హులకు సంక్షేమ పథకాలు వస్తాయన్నారు.
కరీంనగర్ సిటీ : సిటీలోని 54,60వ డివిజన్లలో నిర్వహించిన వార్డు సభల్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకొని వారి అనుమానాలను నివృత్తి చేశారు.
ఎల్లారెడ్డిపేట : ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.