వేములవాడ/వేములవాడ రూరల్, వెలుగు : రైతులను మోసం చేసేవారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. సోమవారం వేములవాడ పట్టణంలోని బాలనగర్ లో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝాతో కలిసి రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో మార్కెట్ యార్డ్ కోసం స్థల పరిశీలన చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం ప్రస్తుతం వేములవాడలో కొనసాగుతున్న మార్కెట్ యార్డ్‌ను మర్రిపల్లిలో ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్న విశాలమైన స్థలంలోకి మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేశ్, సింగిల్‌విండో చైర్మన్ తిరుపతిరెడ్డి, పుల్కం రాజు, తోట రాజు, రమేశ్, వెంకటేష్‌గౌడ్, జైపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
చేప పిల్లల పంపిణీ
కోరుట్ల,వెలుగు : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలోని మండల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఊరచెరువులో విప్ ఆది శ్రీనివాస్ 30,800 చేప పిల్లలను వదిలారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంత రైతుల స్వప్నం సాకారం చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఆయన వెంట జిల్లా మత్స్య శాఖ ఆఫీసర్ విజయభారతి, డాక్టర్ విజయభారతి, ఎంపీడీవో శంకర్, తదితరులు పాల్గొన్నారు.