- పార్కును ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- అంబేద్కర్‌చౌరస్తా అధునీకరణ , డ్రైనేజీ డైవర్షన్‌కు భూమి పూజ
వేములవాడ, వెలుగు : ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన అందిస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడను మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తానన్నారు. రూ.30 లక్షల వీటీడీఏ నిధులతో రాజన్న ఆలయ సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా అధునీకరణ, రూ.3 కోట్ల మున్సిపల్ నిధులతో మురుగు నీరు గుడి చెరువులో కలవకుండా డ్రైనేజీ డైవర్షన్పనులకు కలెక్టర్‌సందీప్ కుమార్ ఝా, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవితో కలిసి ఆయన శుక్రవారం భూమిపూజ చేశారు.
అలాగే రూ. 2 కోట్లతో నిర్మించిన పార్క్ ను ప్రారంభించి పరికరాలను పరిశీలించారు. మొదటి ప్రాధాన్యతలో ఆలయ విస్తరణ చేపడతామని, దేవాలయంలో భక్తులు అడుగుపెట్టగానే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇటీవలే రాజన్న ఆలయానికి 50 కోట్ల నిధులను కేటాయించామని, వీలైనంత త్వరలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. మరోవైపు, స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా వేములవాడ అర్బన్ మండలం మారుపాక లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
డీఎఫ్ఓ బాలమణితో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేశ్, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్ రావు, కమిషనర్ అన్వేశ్, వీటీడీఏ సెక్రటరీ అన్సారీ, తహసీల్దార్ అర్బన్ మహేశ్ కుమార్, ఎంపీడీవో రాజీవ్ మల్హోత్రా, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.