
నర్సింహులపేట (దంతాలపల్లి), వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల కోసం లీడర్లు ఎవరైనా పైసలు వసూలు చేస్తే తోలు తీస్తానని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ హెచ్చరించారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో భూభారతి అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. భూభారతి చట్టంతో భూ సమస్యలు తొలగిపోతాయన్నారు.
ఆడబిడ్డల పేరుమీదనే ఇందిరమ్మ ఇండ్లు రాబోతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలోని లీడర్లు కొంతమంది అమాయక ప్రజలకు తెలియకుండా వారి పేర్లపై ఇండ్లను మంజూరు చేసుకుని డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మచారి, ఆర్డీవో గణేశ్, ఏడీఎస్ఎల్ఆర్ఏ నరసింహమూర్తి, డీఏవో విజయనిర్మల, తహసీల్దార్ సునీల్, ఎంపీడీవో వివేక్ రామ్, ఏఎంసీ వైస్ చైర్మన్ బట్టునాయక్, పీఏసీఎస్ చైర్మన్ రాము పాల్గొన్నారు.