
వాట్సప్ కంపెనీ ఏకపక్షంగా నియమ నిబంధనలను, ప్రైవసీ లను మార్చడం తమకు ఏమాత్రం ఆమోదం యోగ్యం కాదని తెలిపింది భారత్. అది సరైన పద్ధతి కాదంది.దీనికి సంబంధించి కంపెనీకి లేఖ రాసింది. వాట్సప్ ప్రతిపాదించిన ప్రైవసీ పాలసీ విధాన మార్పుల పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని వాట్పప్ సీఈఓ విల్ కాత్‌క్యాట్స్‌ను భారత్ కోరింది.