విద్యకు సర్కారు తొలి ప్రాధాన్యం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

విద్యకు సర్కారు తొలి ప్రాధాన్యం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు :  సీఎం రేవంత్ రెడ్డి విద్యకు మొదటి ప్రాధాన్యత  ఇస్తున్నారని ఎమ్మెల్యే అన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని కోడూరు గ్రామంలోని కస్తుర్బా బాలికల విద్యాలయంలో ఎమ్మెల్యే తన  సొంత నిధులతో ఇంటర్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్, ముడా నిధులతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ ను శనివారం ప్రారంభించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్య పైన అధిక శ్రద్ధ చూపిస్తున్నారని, గత పది సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం  విద్యకు అధిక నిధులు కేటాయించారని ఆయన స్పష్టం చేశారు.    

మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి  చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.  కేజీబీవీలో  తల్లితండ్రులు లేని 11 మంది విద్యార్థుల సంరక్షణ బాధ్యతను ఒక్క సంవత్సరం పాటు కాంగ్రెస్  మండల నాయకులు తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ కాలేజీ  ప్రిన్సిపాల్ సువర్ణ, ఎంఈఓ కృష్ణయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు రామచంద్రయ్య, బి యాదయ్య గౌడ్, మాధవ రెడ్డి, ధర్మాపూర్ నర్సింహారెడ్డి, గోవింద్ యాదవ్ పాల్గొన్నారు.