
హైదరాబాద్, వెలుగు: మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ), లోకాయుక్త నియామకానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ షమీమ్ అక్తర్‌ను నియమించారు. ఈ మేరకు గవర్నర్ నుంచి ఫైల్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. హెచ్ఆర్సీ సభ్యులుగా రమాదేవి, కిషోర్ కుమార్ ను నియమించారు. ఈ మేరకు బుధవారం లేదంటే గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి ప్రస్తుతం రేరా అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా బాధ్యతల్లో ఉన్నారు. షమీమ్ అక్తర్ ప్రభుత్వం నియమించిన ఎస్సీ వర్గీకరణ కమిషన్ చైర్మన్‌గా వ్యవహరించారు.