టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల.. రాజీనామాలకు గవర్నర్ ఆమోదం

టీఎస్‌పీఎస్సీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపింది.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక కొన్ని రోజులకు ఛైర్మన్‌ పదవికి జనార్థాన్ రెడ్డి రాజీనామా  చేశారు. అనంతరం ఒక్కొక్కరిగా సభ్యుల రాజీనామా చేస్తూ వచ్చారు.  

తమ రాజీనామా లేఖలను  గవర్నర్‌కు పంపించారు. అప్పటి నుంచి ఈ రాజీనామాలు గవర్నర్ వద్దే పెండింగ్ లో ఉన్నాయి. తాజాగా  వాటిని గవర్నర్ ఆమోదించారు.  దీంతో టీఎస్‌పీఎస్సీ  ఛైర్మన్‌, సభ్యుల నియమాకానికి లైన్ క్లియర్ అయింది.  కొత్త సభ్యుల నియమాకం తరువాత జాబ్  నోటిఫికేషన్లపై స్పష్టత  వచ్చే అవకాశం ఉంది.