నాలుగు కేటగిరీలు.. రూ.2 లక్షల ప్రైజ్ మనీ: రాజ్ భవన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం

నాలుగు కేటగిరీలు.. రూ.2 లక్షల ప్రైజ్ మనీ: రాజ్ భవన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం

హైదరాబాద్: గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్స్‎లెన్స్ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నుంచి ప్రారంభించబోతున్నట్లు రాజ్ భవన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. తెలంగాణలో వివిధ రంగాల్లో నిష్టాతులకు ఈ అవార్డు ఇవ్వాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్స్‎లెన్స్ అవార్డులు నాలుగు కేటగిరీల్లో ప్రదానం చేస్తామని చెప్పారు. పర్యావరణ, స్పోర్ట్స్, కల్చర్, దివ్యాంగులకు రంగాల్లో కృషి చేసిన వారికి అవార్డులు అందజేస్తామన్నారు. మొత్తం 8 అవార్డులు ప్రదానం చేస్తామని.. ప్రైజ్ మనీ కింద రూ.2 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. 

ఈ అవార్డ్ పొందాలంటే.. తెలంగాణలో కనీసం 5 ఏళ్ళు ఏదైనా రంగంలో పనిచేసి ఉండాలని సూచించారు. ఇనిస్టిట్యూషన్ కేటగిరీ, ఇండివిజువల్ కేటగిరీలుగా అవార్డులు ఉంటాయన్నారు. అవార్డుల కోసం ఆన్ లైన్, ఆఫ్ లైన్‎లో అప్లికేషన్లు ఇవ్వొచ్చని తెలిపారు. 2024, నవంబర్ 2 నుంచి అప్లికేషన్స్ స్వీకరిస్తామని.. ఈ నెల (నవంబర్) 23 సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు గడువు ముగిస్తుందని పేర్కొన్నారు. 2025, జనవరి 26న రాజ్ భవన్‎లో జరిగే ఎట్ హోం కార్యక్రమంలో అవార్డులు ప్రధానం చేస్తామని ఆయన తెలిపారు.