హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అభివృద్ధిని ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ముందుకెళ్తే.. దేశం కూడా మరింత డెవలప్ అవుతుందని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. ఆదివారం రాజ్ భవన్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అవినీతిని అంతమొందిస్తూ రాష్ట్ర ప్రజలకు పారదర్శక పాలన అందించాలని సూచించారు. సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించేలా ప్రభుత్వం, అధికారులు కృషి చేయాలన్నారు. అంతకు ముందు పోలీసుల నుంచి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ గౌరవ వందనం స్వీకరించారు. రాజ్ భవన్ ఉద్యోగులకు, అధికారులకు గిఫ్ట్‌లు అందజేశారు.