నిమ్స్​ వైద్య బృందానికి గవర్నర్​ సత్కారం

నిమ్స్​ వైద్య బృందానికి గవర్నర్​ సత్కారం

ఖైరతాబాద్, వెలుగు: నిమ్స్ డాక్టర్లను రాష్ట్ర గవర్నర్​రాధాకృష్ణన్​సత్కరించారు. నిమ్స్​డాక్టర్లు ఇటీవల చత్తీస్​గఢ్​రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూర్ గ్రామానికి చెందిన ఆదివాసీ సొది నంద(17)కు అరుదైన ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు.

ప్రమాదవశాత్తు అతని గుండెకు ఆనుకుని బాణం దిగగా, కుటుంబ సభ్యులు తొలుత భద్రాచలం, వరంగల్​ఎంజీఎం ఆసుపత్రులకు తీసుకెళ్లారు. చివరికి నిమ్స్ కు తీసుకురాగా, కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వరరావు, డాక్టర్​గోపాల్​పరీక్షించారు.

4 గంటలపాటు శ్రమించి, అతికష్టం మీద బాణాన్ని తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న గవర్నర్​నిమ్స్​డాక్టర్లను అభినందన లెటర్​పంపించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిమ్స్​ డైరెక్టర్ ప్రొఫెసర్​ బీరప్పతోపాటు, డాక్టర్ల టీమ్​ను రాజ్​ భవన్​కు పిలుపించుకుని సత్కరించారు.