
భా రత దేశంలో బ్రిటీష్ సామ్రాజ్య వ్యాప్తిలో కొంత మంది గవర్నర్ జనరల్స్ కీలక పాత్ర పోషించారు . ఈ క్రమంలో ఎన్నో సంస్కరణలు, చట్టాలను తీసుకువచ్చారు. వారన్ హేస్టింగ్స్ కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయగా, కారన్ వాలీస్ సివిల్ సర్వీసులను ప్రవేశపెట్టి సివిల్ సర్వీసుల పితామహునిగా నిలిచాడు. లార్డ్ వెల్లస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టి స్వదేశీ సంస్థానాలను ఆయుధరహితంగా మార్చాడు. లార్డ్ హేస్టింగ్స్ 28 యుద్ధాల్లో పాల్గొని 128 కోటలను జయించాడు. వారన్ హేస్టింగ్స్(1773-1786): రెగ్యులేటింగ్ యాక్ట్ –1773 ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్‌గా వారన్ హేస్టింగ్స్ నియమితులయ్యారు.
మొదట తన జీవితాన్ని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో రైటర్‌గా ప్రారంభించాడు. పర్షియన్, బెంగాల్ భాషలు తెలిసిన ఏకైక గవర్నర్ జనరల్. జిల్లా స్థాయిలో దివాని, ఫౌజ్దార్ అదాలత్‌ను ఏర్పాటు చేశాడు. కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేశాడు. ఇతని కాలంలో మొదటి మహారాష్ట్ర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటీష్ వారికి అనుకూలంగా ఫలితాలు రాలేదు.
ఈ యుద్ధం 1782 సాలేబే సంధితో ముగిసింది. ఇతని కాలంలోనే రెండో మైసూర్ యుద్ధం జరిగింది. 1774లో రోహిల్లా యుద్ధం జరిపి రోహిల్‌ఖండ్‌ను ఆక్రమించాడు. సొంత భూభాగాలను రక్షించుకోవడానికి ఇరుగు పొరుగు సరిహద్దుల వారితో రింగ్ ఫెన్స్ పాలసీని అనుసరించాడు. వారన్ హేస్టింగ్స్ బ్రిటీష్ పార్లమెంట్ లో 20 కేసులతో అభిశంసన తీర్మానం ఎదుర్కొన్నాడు. ఇందులో నందకుమార్ కేసు, బైత్సింగ్ కేసు, అవధ్ రాణితో అనుసరించిన కేసులు ఉన్నాయి. అయితే, ప్రభుత్వానికి సేవలు చేసినందుకు కేసుల నుంచి విముక్తి పొందాడు. ఇతడు ప్రాశ్చ్య సంస్కృతి పట్ల అభిమానం కలిగినవాడు. 1784లో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్‌ను స్థాపించాడు. దీనికి విలియం జోన్స్ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. చార్లెస్ విల్కిన్స్ ఇంగ్లీష్లోనికి అనువదించిన భగవద్గీతకు ఉపోద్ఘాతం రాశాడు.
లార్డ్ వారన్ హేస్టింగ్స్ (1813–1823): ఇతని కాలంలో ముంబయి ప్రెసిడెన్సీ ఏర్పడింది. ఆంగ్లో–నేపాలీస్ యుద్ధం 1814–16లో జరిగింది. పిండారీలను తీవ్రంగా అణచివేశాడు. ఇందుకుగాను సర్ థామస్ హిప్లాస్ అనే సైన్యాధికారిని ఉపయోగించుకున్నాడు. భారతదేశంలో లార్డ్ హేస్టింగ్స్ 28 యుద్ధాల్లో పాల్గొన్నాడు. హేస్టింగ్స్ మన దేశంలో 128 కోటలను జయించాడు. ఇతని కాలంలో మూడో మహారాష్ట్ర యుద్ధం జరిగింది.
ఇందులో పీష్వాలు పూర్తిగా ఓడిపోయి మహారాష్ట్ర నుంచి వెళ్లిపోయారు. రాజపుత్రులను బ్రిటీష్ వారికి సహజ మిత్రులుగాను, మరాఠాలను సహజ శత్రువులుగా భావించిన ఏకైక గవర్నర్ జనరల్. హేస్టింగ్స్ కాలంలోనే భారతదేశంలో మొదటి వెర్నాక్యులర్ న్యూస్ పేపర్ అయిన సమాచార్ దర్పణ్ ప్రారంభించబడింది. ఇతని కాలంలో మద్రాస్ రాష్ట్రంలో సర్ థామస్ మన్రో నాయకత్వంలో రైత్వారీ విధానం ఏర్పాటు చేశారు.
కారన్ వాలీస్ (1786-1793): భారతదేశంలో సివిల్ సర్వీసుల పితామహునిగా పేరు పొందాడు. బెంగాల్ ప్రెసిడెన్సీని నాలుగు డివిజన్లుగా విభజించాడు. ఉద్యోగాలకు జీతాలు చెల్లించడం ద్వారానే వారిలో నిజాయితీ, నైపుణ్యాన్ని పెంచవచ్చునని గుర్తించిన మొదటి గవర్నర్ జనరల్. వారన్ హేస్టింగ్స్ పరిచయం చేసిన న్యాయ విధానాన్ని స్థిరపరిచాడు. జమిందారులను పోలీస్ విధుల నుంచి తప్పించాడు.
ఠాణాల పురాతన భారత విధానాన్ని ఆధునీకరించాడు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోస్టును ఏర్పరిచాడు. పోలీసు అధికారుల్లో నిజాయితీ పెంచేందుకు వారి జీతాలు పెంచాడు. జిల్లా అధికార విధులను జిల్లా కలెక్టర్‌కు అప్పగించాడు. కారన్‌వాలీస్ న్యాయ సంస్కరణల ప్రకారం న్యాయపాలన దిగువస్థాయిలో ఉంది. మున్సిఫ్ కోర్టు, జిల్లా కలెక్టర్ నుంచి సివిల్ జడ్జి పోస్టును వేరు చేశాడు. ఇది సమానత్వ అంశాలతో కూడుకొని ఉంది. నాలుగు సర్క్యూట్ కోర్టులను ఏర్పాటు చేశాడు. పాట్నా, ఢాకా, కలకత్తా, ముర్షిదాబాద్‌లలో నాలుగు ప్రొవిన్షయల్ కోర్టులను స్థాపించాడు.
ఈ కాలంలో జీవితఖైదు లేక మరణ శిక్షలను విధించే కోర్టులు ప్రొవిన్షియల్ కోర్టు. కారన్ వాలీస్ కోడ్ (1793) న్యాయపాలన నుంచి రెవెన్యూ పాలనను వేరుపరిచింది. ఇతని కాలంలో మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. ఇందులో టిప్పుసుల్తాన్ ఓడిపోయాడు. శ్రీరంగ పట్టణం సంధితో 1792లో యుద్ధం ముగిసింది. 1793 బెంగాల్లో శాశ్వత శిస్తు విధానం ఏర్పాటు చేయడంలో సర్ డాన్ఫోర్(1793–1798) ప్రముఖ పాత్ర పోషించాడు. ఇతను అనుసరించిన విధానాన్నే తటస్థ విధానం అంటారు.
లార్డ్ వెల్లస్లీ (1798-1805): సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇతను బెంగాల్ టైగర్ అని పిలువబడ్డాడు. ఇతని సైన్యసహకార పద్ధతి ద్వారా భారతదేశంలో బ్రిటీష్ సార్వభౌమాధికారం ఉన్నత శిఖరాలకు చేరింది. ఈ ఒప్పందం ప్రకారం స్వదేశీ సంస్థానాదీశులు ఒక బ్రిటీష్ రెసిడెంట్‌ను తమ రాజధానిలో ఉంచుకుంటారు. ఇతను సంస్థానం అంతర్గత, బహిర్గత శాంతి భద్రతలను చూసుకొంటాడు. ఇందుకు ప్రతిగా బ్రిటీష్ సైన్య పోషణకు కొంత భూభాగాన్ని బ్రిటీష్ వారికి అప్పగించాలి.
సైన్య సహకార పద్ధతిలో చేరిన మొదటి స్వదేశీ రాజు హైదరాబాద్ నిజాం. ఈ సైన్యసహకార పద్ధతి భారత రాజ్యాలను ఆయుధ రహితంగా చేసింది. 1802లో జరిగిన బసాయిన్ సైన్య సహకార సంధిపై రెండో బాజీరావు, వెల్లస్లీ సంతకం చేశారు. భారతదేశ రక్షణ వెల్లస్లీ కాలంలో కంపెనీ బాధ్యతగా మారింది. దుష్పరిపాలన కింద తంజావూర్, కర్ణాటకలను ఆక్రమించి, మద్రాస్ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేశాడు. యువ సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇచ్చేందుకుగాను 1800లో ఫోర్ట్ విలియం కాలేజీని స్థాపించాడు.
విలియం బెంటింగ్ (1828-35): బెంగాల్ గవర్నర్ జనరల్‌గా ఉన్న విలియం బెంటింగ్ 1833 చార్టర్ చట్టం ప్రకారం మొదటిసారిగా భారత గవర్నర్ జనరల్‌గా మారాడు. పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ అధ్యక్షునిగా మెకాలేను నియమించాడు. థగ్గులను అణచివేశాడు. ఇందుకోసం 1831లో కల్నల్ విలియం స్లీమాన్ సేవలు వినియోగించుకున్నాడు. దాదాపు 1500 మంది థగ్గులను అరెస్టు చేశాడు. మైసూర్, కూర్గ్, సెంట్రల్ కచ్చర్లను ఆయా ప్రాంతాల్లో దుష్పరిపాలనాధారంగా ఆక్రమించాడు. అధికార భాషలుగా పర్షియన్, వెర్నాక్యూలర్ భాషలను బెంటింగ్ గుర్తించాడు.
రంజిత్‌సింగ్‌తో స్నేహపూర్వక సంధిని ముగించాడు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతవాసుల సౌలభ్యానికి ప్రత్యేక సదర్ నిజామత్, సదర్ దివానీ అదాలత్‌లను అలహాబాద్‌లో ఏర్పరిచారు. కారన్‌వాలీస్ ప్రవేశపెట్టిన అప్పీల్, సర్క్యూట్ ప్రొవెన్షియల్ కోర్టులను 1831లో రద్దు చేశాడు. సాదరీ–దివాని–అదాలత్, సాదరీ–నిజామత్–అదాలత్‌ను అలహాబాద్‌లో ఏర్పాటుచేశాడు. న్యాయ సలహా సభ్యుడైన మెకాలే నివేదిక ప్రకారం ఈయన కాలంలో పర్షియా భాష స్థానంలో ఇంగ్లీష్‌ను అధికార భాషగా గుర్తించారు.
లార్డ్ మింటో (1807-1813): ఇతనికాలంలో 1809లో రంజిత్‌సింగ్‌తో అమృత్సర్ సంధి చేసుకున్నాడు. ఇతని కాలంలోనే 1813లో చార్టర్ చట్టం వచ్చింది. దీనిపరంగా విద్య కోసం లక్ష రూపాయలు కేటాయించారు