
సికింద్రాబాద్, వెలుగు: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కొనసాగుతున్న ‘ఉద్యాన్ ఉత్సవ్’ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం సందర్శించారు. అక్కడి స్టాళ్లను పరిశీలించి మొక్కలు పెంపకం, పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. సేంద్రియ వ్యవసాయం, భూసంస్కరణలు, పర్యావరణంపై ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి అవగాహన పొందాలని సూచించారు. అక్కడ ఏర్పాటు చేసిన గ్రీన్వాల్ప్రతిజ్ఞ, రూఫ్ టాప్ గార్డెన్వర్క్షాపు, పాట్వీల్, కుండల తయారీ, ఫ్లవర్ వేస్ట్ టు వెల్త్రీసైక్లింగ్ప్రాజెక్టులను గవర్నర్ పరిశీలించి మెచ్చుకున్నారు. సోమవారం 8,500 మంది ఉద్యాన్ఉత్సవ్ ను సందర్శించారు.