గవర్నర్ తమిళి సై రాజకీయాలు చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు...
ప్రతి గింజా కొంటాం...
గవర్నర్ రాజకీయాలు చేయకపోతే ఆమెను గౌరవించేవారిమని గంగుల అన్నారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగ బద్ధ పదవిలో ఉండి రాజకీయం చేసేవారిని కలవరని చెప్పారు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కర్షకులెవరూ అధైర్యపడొద్దని, తడిసిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.