ఏపీ అసెంబ్లీ రద్దు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ రద్దు చేస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీచేశారు. ఆర్టికల్ 174 ప్రకారం కేబినెట్ సిఫార్సు తో అసెంబ్లీ రద్దు చేశారు. ఏపీలో అత్యధిక సీట్లు గెలవడంతో  కూటమి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 135,జనసేన 21, బీజేపీ 8, వైఎస్సార్ సీపీలకు 11 స్థానాల్లో విజయం సాధించిన  సంగతి తెలిసిందే. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 9న లేదా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ఎన్డీయే మీటింగ్ లో పాల్గొననున్నారు. ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామి అయిన చంద్రబాబు కేంద్రంలో కీలక పాత్ర పోషించనున్నారు.