‘స్వచ్ఛ’ సమాజం సాధించాలని ప్రతిజ్ఞ

ఖైరతాబాద్, వెలుగు: స్వచ్ఛ, సురక్షిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్​ జిష్ణుదేవ్​వర్మ పిలుపునిచ్చారు. ఖైరతాబాద్​పరిధిలోని ఇందిరానగర్​లో శుక్రవారం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత సాధ్యమవుతుందన్నారు.

స్వచ్ఛతపై అందరితో గవర్నర్​ప్రతిజ్ఞ చేయించారు. అంతకు ముందు గవర్నర్​ ఇందిరానగర్ లో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.  గవర్నర్​ సెక్రటరీ బుర్రా వెంకటేశం, జీహెచ్ఎంసీ కమిషనర్ ​ఆమ్రపాలి, కార్పొరేటర్​ విజయారెడ్డి  పాల్గొన్నారు.