పద్మారావునగర్, వెలుగు : తన సొంత ఖర్చుతో అనాథాశ్రమాలు, ప్రభుత్వ స్కూళ్లలో 17 లైబ్రరీలు ఏర్పాటు చేసిన హైదరాబాద్పబ్లిక్స్కూల్ఎనిమిదో తరగతి విద్యార్థిని ఆకర్షణను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అభినందించారు. లైబ్రరీల ఏర్పాటు విషయం తెలుసుకున్న గవర్నర్బుధవారం ఆకర్షణను, ఆమె తండ్రి సతీశ్‌ను రాజ్ భవన్ కు పిలిపించి పుస్తకాలు, వాచ్ఇచ్చారు.
చిన్న వయస్సులో పెద్ద మనసుతో లైబ్రరీలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ నెల 25న మూసాపేట శ్రీసత్యసాయి బాలికల అనాథాశ్రమంలో లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్య అతిథి రావాలని ఆకర్షణ కోరగా గవర్నర్సానుకూలంగా స్పందించారు.