
తెలంగాణ వ్యాప్తంగా రిపబ్లిక్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జాతీయ జెండా ఎగురవేశారు. సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. జెండా ఆవిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పలువురు మంత్రులు హాజరయ్యారు. అంతకు ముందు రేవంత్ రెడ్డి అమరజవాన్ల స్థూపానికి నివాళి అర్పించారు.
ట్రాఫిక్ ఆంక్షలు
మరో వైపు రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఆదివారం సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ తో పాటు రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో వాహనాల దారి మళ్లింపు చేయనున్నారు. ఈ మేరకు అడిషనల్ సీపీ(ట్రాఫిక్) విశ్వప్రసాద్ శనివారం నోటీఫికేషన్ విడుదల చేశారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలు, పంజాగుట్ట నుంచి బేగంపేట మీదుగా సికింద్రాబాద్ వెళ్లే రూట్ లో ఉదయం 7.30 గంటల నుంచి 11.30 వరకు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.