- రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సూచన
- నాచారంలో చిల్డ్రన్ ట్రాఫిక్అవేర్నెస్ పార్కు ప్రారంభం
నాచారం, వెలుగు: ప్రతి స్కూల్లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులను ఏర్పాటు చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. సోమవారం నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్పార్కు ప్రారంభోత్సవంలో గవర్నర్ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లాస్ రూమ్స్ లోనే అనేక విషయాలు తెలుస్తాయని, స్కూల్లెవెల్లోనే ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు, పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి స్క్రాప్పాలసీని తీసుకువచ్చామని చెప్పారు. ట్రాఫిక్ అవేర్నెస్ పై ఒక పాఠం ఉండేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ఉప్పల్ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, వాణి దేవి, రవాణా శాఖ ఉన్నతాధికారులు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.