ట్రెండ్​కు తగ్గట్టు మారాలి

ట్రెండ్​కు తగ్గట్టు మారాలి
  • క్రియేటివిటీ చూపించాలి
  • ఎఫ్ టీటీఐ స్నాతకోత్సవంలో గవర్నర్​-జిష్ణుదేవ్ వర్మ

గచ్చిబౌలి, వెలుగు: ప్రస్తుతం ఉన్న ట్రెండ్​కు అనుగుణంగా క్రియేటివిటీ చూపించాలని గవర్నర్​-జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. చెప్పులు, ఫ్యాషన్, రిటైల్, తోలు ఉత్పత్తుల రంగాల్లో నిలదొక్కుకొనేందుకు పారిశ్రామిక స్ఫూర్తిని అలవరుచుకోవాలని సూచించారు. రాయదుర్గంలోని ఫుట్​వేర్​డిజైన్​అండ్​డెవలప్​మెంట్​ఇన్​స్టిట్యూట్(ఎఫ్​డీడీఐ) నాలుగో స్నాతకోత్సవం సోమవారం క్యాంపస్​ప్రాంగణంలో జరిగింది. ముఖ్య అతిథిగా గవర్నర్ పాల్గొని మాట్లాడుతూ.. ట్రెండ్​కు అనుగుణంగా రాణించాలంటే క్రియేటివిటీ ముఖ్యమని చెప్పారు. 

తర్వాత ఎఫ్​డీడీఐ పాదరక్షలు, ఫ్యాషన్, రిటైల్, లెదర్​కోర్సుల్లో డిగ్రీ, పీజీలు పూర్తిచేసిన 108 మందికి గవర్నర్​పట్టాలు అందజేశారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​రంజన్, ఎఫ్​డీడీఐ ఎగ్జిక్యూటివ్​డైరెక్టర్ డా.నరసింహుగారి తేజ్​లోహిత్​రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్లు​తయారు చేసిన ఉత్పత్తులు ఆకట్టుకున్నాయి.