కుటుంబ బంధాలను కాపాడేదే రక్షాబంధన్ : గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

కుటుంబ బంధాలను కాపాడేదే రక్షాబంధన్ : గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

ఉప్పల్, వెలుగు: కుటుంబ బంధాలను కాపాడేదే రక్షా బంధన్ అని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్ లోని  ఉప్పల్ శిల్పారామంలో ఆదివారం నిర్వహించిన రాఖీ పండుగ వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అన్నా చెల్లి, అక్కా తమ్ముళ్ల మధ్య రక్త సంబంధాన్ని రక్షా బంధన్  కాపాడుతుందని ఆయన పేర్కొన్నారు. మనమంతా సమానమే అని, మన సంస్కృతులన్నీ ఒక్కటే అని చెప్పారు. 

మన సోదరినే కాకుండా సమాజాన్ని సైతం  రక్షించేందుకు ప్రతినబూనాలని సూచించారు.దేశానికి రక్షణ ఉన్నప్పుడే మనమంతా ప్రశాంతంగా ఉంటామన్నారు. మల్కాజిగిరి ఎంపీ  ఈటల రాజేందర్  మాట్లాడుతూ తనను రక్షించు అని చెబుతూ సోదరుడికి సోదరి రాఖీ కడుతుందన్నారు. అలాగే దేశాన్ని కాపాడడానికి సోదరులంతా రక్షగా ఉండాలని భరతమాత అంటుందన్నారు.