- స్టూడెంట్లకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచన
- ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలి
- ఏఐసీటీఈ చైర్మన్ టీజీ సీతారాం పిలుపు
- అట్టహాసంగా హెచ్సీయూ కాన్వొకేషన్ డే
గచ్చిబౌలి, వెలుగు : మన చదువు సమాజానికి దోహదపడాలని రాష్ట్ర గవర్నర్జిష్ణుదేవ్వర్మ చెప్పారు. యూనివర్సిటీల్లో చదువుకుంటున్న స్టూడెంట్లు అకడమిక్ విద్యతోపాటు సామాజిక బాధ్యతను కలిగి ఉండాలన్నారు. రెండింటిని బ్యాలెన్స్చేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్సెంట్రల్ యూనివర్సిటీ 24వ కాన్వొకేషన్డే మంగళవారం అట్టహాసంగా జరిగింది. గచ్చిబౌలిలోని బ్రహ్మ కుమారీస్ శాంతిసరోవర్లో నిర్వహించిన వేడుకలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఏఐసీటీఈ(ఆల్ఇండియా కౌన్సిల్ఫర్టెక్నికల్ఎడ్యుకేషన్) చైర్మన్ ప్రొ.టీజీ సీతారాం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్మాట్లాడుతూ.. దేశం కోసం పాటుపడిన ప్రముఖుల నుంచి స్ఫూర్తి పొందాలని, వారి ఆలోచనలకు అనుగుణంగా ముందడుగు వేయాలని సూచించారు. సీతారాం మాట్లాడుతూ.. స్టూడెంట్లు నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్పై ఫోకస్పెట్టాలన్నారు. హెచ్సీయూ చాన్స్లర్ ఎల్.నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులే హెచ్సీయూ టార్చ్బేరర్లు అన్నారు. వర్సిటీ పేరు, ప్రఖ్యాతలను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.
స్నాతకోత్సవంలో మొత్తం 236 మంది పీహెచ్డీ పట్టాలు అందుకున్నారు. ఇందులో 164 మంది స్టూడెంట్లు మెడల్స్సాధించారు. ఈ కార్యక్రమంలో హెచ్సీయూ వీసీ బీజేరావు, రిజిస్ట్రార్దేవిష్ నిగమ్, ఇన్చార్జ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్తుకారం, డిపార్ట్మెంట్ల డీన్లు, ప్రొఫెసర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.