రాజ్యాంగం జీవన మార్గం : గవర్నర్‌‌‌‌ జిష్ణుదేవ్ వర్మ

రాజ్యాంగం జీవన మార్గం : గవర్నర్‌‌‌‌ జిష్ణుదేవ్ వర్మ
  • అందరికి సమాన హక్కులు కల్పించింది : గవర్నర్‌‌‌‌ జిష్ణుదేవ్ వర్మ

హైదరాబాద్, వెలుగు: దేశ రాజ్యాంగం మన జీవన మార్గమని గవర్నర్ జిష్ణుదేవ్‌‌‌‌ వర్మ అభివర్ణించారు. ప్రజలు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో మెలిగేందుకు వీలుగా రూపకల్పన జరిగిందన్నారు. మంగళవారం హైకోర్టు ఆవరణలో  హైకోర్టు బార్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ఆధ్వర్యంలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి. దీనికి గవర్నర్‌‌‌‌ జిష్ణుదేవ్‌‌‌‌ వర్మ చీఫ్ గెస్టుగా  హాజరై, మాట్లాడారు. "రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి వెన్నెముక. 

దేశ ప్రజలందరికీ సమానమైన హక్కులు, విధులు కల్పించింది. రాజ్యాంగం అనేది జీవన మార్గం. దేశ సార్వభౌమ, ప్రజాస్వామ్య బలోపేతానికి తోడ్పాటు. అంబేద్కర్ వంటి ఎంతో మంది ప్రముఖుల దూరదృష్టి అంకిత భావంతో  ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగం ఏర్పడింది. ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్లుగా ప్రాథమిక హక్కులు, విధుల మధ్య సమతూల్యతను రాజ్యాంగం వివరించింది’’ అని గవర్నర్ పేర్కొన్నారు. 

రాజ్యాంగం బాధ్యత మనదే 

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ ఆరాధే మాట్లాడుతూ.. రాజ్యాంగం న్యాయ పత్రం కాదని, ఇది నైతిక దిక్సూచి అని పేర్కొన్నారు. రాజ్యాంగానికి పరిరక్షణగా సుప్రీం కోర్టు ఉందని తెలిపారు. న్యాయానికి రక్షకులుగా రాజ్యాంగ పవిత్రను కాపాడే బాధ్యత మనపై ఉందన్నారు.